సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ఊరు పేరు భైరవ కోన. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయిక లు. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండా నిర్మించారు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ మ్యాజికల్ ఫాంటసీ ఈ నెల 16న విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ దాదాపు రెండున్నరేళ్ల పాటు ఊరు పేరు భైరవ కోన కోసం కష్టపడ్డా ను. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఉన్న మంచి కమర్షియల్ సినిమా ఇది అన్నారు. సందీప్ కిషన్ ఈ సినిమా తో నెక్ట్స్ రేంజ్‌కు వెళ్తాడని నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. ఊరు పేరు భైరవ కోన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సూపర్ నేచురల్ ఫాంటసీ, మంచి లవ్ స్టోరీ ఉంది అని దర్శకుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.