అమెరికా – చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైంది. అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతా లను ఎగుమతి చేయడాన్ని డ్రాగన్ కంట్రీ నిలిపివేసింది. దాంతో పశ్చిమ దేశాల్లో ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్ తయారీ కంపెనీలు, సెమీకండక్టర్స్ కంపెనీలకు సమస్యలు ఎదురుకానున్నాయి.

ఎగుమతులకు సంబంధించిన నూతన నిబంధనలను చైనా రూపొందిస్తోంది. అప్పటివరకు చైనా పోర్టుల నుంచి మాగ్నెట్‌ల ఎగుమతులను నిలిపివేశారు. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే కొన్ని కంపెనీలకు శాశ్వతంగా మాగ్నెట్‌ల సరఫరా నిలిచిపోనుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలు పెట్టిన వాణిజ్య యుద్ధానికి ప్రతి స్పందనగానే కీలక విడిభాగాల ఎగుమతులను చైనా ఆపేసింది.
