అమెరికా మసాచుసెట్స్ రాష్ట్రంలోని అయెర్ జిల్లా కోర్టు మొదటి జస్టిస్‌గా ఇండియన్ అమెరికన్ మహిళా జడ్జి తేజల్ మెహతా ఈనెల 2న ఎంపికయ్యారు. తరువాత జిల్లాకోర్టు చీఫ్‌జస్టిస్ స్టేసీ ఫోర్టెస్ ప్రమాణస్వీకారం చేయించారు. ఆమె నాయకత్వంలో ఈ జిల్లా కోర్టుకు మరింత ఉత్తమ సేవలు అందుతాయన్న నమ్మకం తనకు ఉందని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తేజల్ మెహతా మాట్లాడుతూ న్యాయవాదిగా ఒక స్థాయివరకే ప్రజలకు సహాయం చేయగలుగుతారని, జడ్జిగా ఇంచా చాలా చేయడమౌతుందని, సమస్యల మూలాల్లోకి వెళ్లి పరిష్కరించ గలుగుతారని తేజల్ మెహతా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో మెహతా కుటుంబీకులు మెహతా 14 ఏళ్ల కుమార్తె మేనా షేత్ తోసహా అనేక మంది పాల్గొన్నారు.