Skip to main content

Namaste NRI

అమెరికా జిల్లా కోర్టు జస్టిస్‌గా…ఇండియన్ అమెరికన్ మహిళా

అమెరికా మసాచుసెట్స్ రాష్ట్రంలోని అయెర్ జిల్లా కోర్టు మొదటి జస్టిస్‌గా  ఇండియన్ అమెరికన్ మహిళా జడ్జి తేజల్ మెహతా ఈనెల 2న ఎంపికయ్యారు. తరువాత జిల్లాకోర్టు చీఫ్‌జస్టిస్  స్టేసీ ఫోర్టెస్ ప్రమాణస్వీకారం చేయించారు. ఆమె నాయకత్వంలో ఈ జిల్లా కోర్టుకు మరింత ఉత్తమ సేవలు అందుతాయన్న నమ్మకం తనకు ఉందని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తేజల్ మెహతా మాట్లాడుతూ న్యాయవాదిగా ఒక స్థాయివరకే ప్రజలకు సహాయం చేయగలుగుతారని, జడ్జిగా ఇంచా చాలా చేయడమౌతుందని, సమస్యల మూలాల్లోకి వెళ్లి పరిష్కరించ గలుగుతారని తేజల్ మెహతా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో మెహతా కుటుంబీకులు మెహతా 14 ఏళ్ల కుమార్తె మేనా షేత్ తోసహా అనేక మంది పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News