జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో (ఎన్‌ఎస్‌ఏ) అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ ఢిల్లీలో సమావేశమయ్యారు. పరస్పర ప్రయోజనాలతో ముడిపడిన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి ఇరువురు చర్చించారు. ఇరు దేశాలకు చెందిన వివిధ విభాగాల ప్రతినిధి బృందాలతోనూ ఎన్‌ఎస్‌ఏలు చర్చించనున్నారు.

ఇక సీఐఐ ఆధ్వర్యంలో జరిగే ఇండియా-యూఎస్ ఐసీఈటీ రౌండ్‌టేబుల్ భేటీలోనూ వీరు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి పరిశ్రమ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు, సీఈవోలు హాజరు కానున్నారు.
