అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ , ఆయన భార్య ఉషా వాన్స్ భారత పర్యటన ఖరారైంది. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వారు వచ్చే వారం భారత్‌కు రానున్నారు. ఈనెల 21 నుంచి 24 వరకూ పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్‌తో కలిసి భారత్‌లో పర్యటించనున్నారు.

21వ తేదీన జేడీ వాన్స్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తో సమావేశమవుతారు. భారత్ – అమెరికా సంబంధాల ను బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నేతలూ చర్చించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. 24వ తేదీ వారు వాషింగ్టన్ డీసీ బయల్దేరి వెళ్లనున్నట్లు పేర్కొంది. ఈ పర్యటనలో జేడా వాన్స్ ప్యామిలీ రాజస్థాన్ జైపూర్, ఆగ్రాను కూడా సందర్శించనున్నట్లు వెల్లడించింది. సెకండల్ లేడి ఉష వాన్స్ తొలిసారి భారత్‌లో పర్యటించనున్నారు. ఆమె తల్లిదండ్రులు క్రిష్ చిలుకూరి, లక్ష్మీ చిలుకూరి 1970 చివరలో భారత్ నుంచి అమెరికాకు వెళ్లారు. ఆమె అక్కడే జన్మించారు.
