డైరెక్టర్ కే.విజయభాస్కర్ చాలా ఏండ్ల తర్వాత మళ్లీ ఓ సరికొత్త ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతు న్నాడు. ఉషా పరిణయం అనే బ్యూటీఫుల్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక. క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కే.విజయ్‌భాస్కర్ స్వీయ దర్శకత్వంలో రూపొందను న్న ఉషా పరిణయం సినిమాతో ఆయన తనయుడు శ్రీకమల్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. తాన్వీ ఆకాంక్ష అనే అచ్చ తెలుగమ్మాయి హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది. వాలంటైన్స్ డే సందర్బంగా ఈ చిత్రానికి సంబం ధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయ్యిందని, త్వరలోనే విదేశా లకు వెళ్లి పాటల చిత్రీకరణ పూర్తి చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.