Namaste NRI

ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త పోస్టర్ – త్వరలోనే ప్రత్యేక గ్లింప్స్‌

పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న పానిండియా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌.శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలు. ఈ సందర్భంగా నిర్మాతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమాకు చెందిన కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. హ్యాట్‌ ధరించి ైస్టెలిష్‌గా కనిపిస్తున్న పవన్‌కల్యాణ్‌ని ఈ పోస్టర్‌లో చూడొచ్చు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్లుగా నిలిచాయనీ, ఈ రెండు పాటలూ పవర్‌స్టార్‌ ఆరాను ఆవిష్కరిస్తూ, అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయని మేకర్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో ఈ సినిమాలో వపన్‌కల్యాణ్‌ కనిపిస్తారని, త్వరలోనే ఈ సినిమాకు చెందిన 40 సెకన్ల గ్లింప్స్‌ని విడుదల చేయనున్నామని మేకర్స్‌ తెలిపారు. ఈ సినిమా స్థాయినీ, కథలోని తీవ్రతనూ ఈ గ్లింప్స్‌ ఆవిష్కరిస్తుందని వారన్నారు. ఈ చిత్రంలో పార్థీబన్‌ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కథనం: కె.దశరథ్‌, రమేష్‌రెడ్డి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, దర్శకత్వం: హరీశ్‌శంకర్‌, నిర్మాతలు: నవీన్‌ యర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, నిర్మాణం: మైత్రీమూవీమేకర్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events