వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శబరి. ముహూర్తం సన్నివేశానికి దర్శకుడు మదన్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, నిర్మాత సతీష్ వేగేశ్న క్లాప్ ఇచ్చారు. దర్శకుడు బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది అన్నారు. ఇప్పటి వరకూ చేయని శబరి అనే కొత్త పాత్రలో వరలక్ష్మి కనిపిస్తారు. వరలక్ష్మి శరత్‌కుమార్ పాత్ర సినమాకి ప్రధాన ఆకర్షణ అన్నారు. కథ, కథనాలు, సరికొత్తగా ఉంటాయి అన్నారు మహేంద్రనాథ్. ఈ నెల 11 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం అన్నారు. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, సమర్పణ : మహర్షి కూండ్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల.