Skip to main content

Namaste NRI

శబరిగా వస్తున్న వరలక్ష్మీ శరత్‌ కుమార్‌

వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శబరి. ముహూర్తం సన్నివేశానికి దర్శకుడు మదన్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, నిర్మాత సతీష్‌ వేగేశ్న క్లాప్‌ ఇచ్చారు. దర్శకుడు బి.గోపాల్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రమిది అన్నారు. ఇప్పటి వరకూ చేయని  శబరి అనే కొత్త పాత్రలో వరలక్ష్మి కనిపిస్తారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ పాత్ర సినమాకి ప్రధాన ఆకర్షణ అన్నారు. కథ, కథనాలు, సరికొత్తగా ఉంటాయి అన్నారు మహేంద్రనాథ్‌.  ఈ నెల 11 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం అన్నారు. అనిల్‌ కాట్జ్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్‌, సమర్పణ : మహర్షి కూండ్ల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సీతారామరాజు మల్లెల.

Social Share Spread Message

Latest News