ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడు నికోలాయ్ సచ్‌దేవ్ ను పెళ్లి చేసుకుంది. థాయ్‌లాండ్‌లోని ఓ బీచ్ రిసార్ట్‌లో జూలై 10న వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. నూతన దంపతుల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, మార్చి 1న వీరి ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.
14 ఏళ్ల క్రితం వరలక్ష్మి, నికోలాయ్ సచ్‌దేవ్ లు ఒకరికొకరు పరిచయం అయ్యారు. వారి పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. ఆ తరువాత ప్రేమగా మారింది. ఇరువురు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కాగా.. వరలక్ష్మికి ఇది మొదటి మ్యారేజ్ కాగా నికోలాయ్‌కు ఇది రెండో వివాహం.