Namaste NRI

వియత్నాంలో వరుణ్ తేజ్ … ఎందుకంటే?

వరుణ్తేజ్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వీడీ 15 అనేది వర్కింగ్ టైటిల్. యువీ క్రియేషన్స్, ఫస్ట్ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నా యి. ఇండో-కొరియన్ హారర్ కామెడీ జానర్లో తెరకెక్కుతోంది. మార్చి మొదటివారం నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నట్లు యూనిట్ తెలిపింది. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం వియత్నాం లో జరుగుతోంది. వినూత్నమైన కథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతున్నామ ని, వరుణ్తేజ్ ఇప్పటివరకూ చేయని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని మేకర్స్ చెప్పారు. వీడీ 15 కు తమన్ సంగీతం అందిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

Social Share Spread Message

Latest News