యువహీరో వరుణ్‌తేజ్, నటి లావణ్య త్రిపాఠి వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. మెగా కుటుంబంలో అంగరంగవైభవంగా జరిగిన ఈ వేడుకకు ఇటీలీలోని టస్కానీ వేదికైంది. ఈ వేడుకకు కొణిదెల, త్రిపాఠీల కుటుంబ సభ్యులతోపాటు అల్లు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. వరుణ్‌తేజ్ పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి అన్నీ తానై ఈ వేడుకను పర్యవేక్షించినట్టు తెలిసింది. పెళ్లి పరాయిదేశంలో జరిగినా, ఎక్కడా భారతీయ కట్టుబాట్లకు ఢోకా రానివ్వకుండా సంప్రదాయ బద్ధంగా వరుణ్, లావణ్యల వివాహం జరిగినట్టు సమాచారం. ఈ వేడుకకు హాజరైన వారిలో చిరంజీవి దంపతులు, పవన్‌కల్యాణ్ దంపతులు, అల్లు అర్జున్ దంపతులు, రామ్ చరణ్ దంపతులు ఇంకా మిగిలిన కుటుంబసభ్యులు, బంధుమిత్రులు పలువురు ఉన్నారు. దాదాపు వేడుకకు హాజరైన అందరూ సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)