Skip to main content

Namaste NRI

అంగరంగ వైభవంగా వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి వివాహం

యువహీరో వరుణ్‌తేజ్‌, నటి లావణ్య త్రిపాఠి వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. మెగా కుటుంబంలో అంగరంగవైభవంగా జరిగిన ఈ వేడుకకు ఇటీలీలోని టస్కానీ వేదికైంది. ఈ వేడుకకు కొణిదెల, త్రిపాఠీల కుటుంబ సభ్యులతోపాటు అల్లు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. వరుణ్‌తేజ్‌ పెదనాన్న మెగాస్టార్‌ చిరంజీవి అన్నీ తానై ఈ వేడుకను పర్యవేక్షించినట్టు తెలిసింది. పెళ్లి పరాయిదేశంలో జరిగినా,  ఎక్కడా భారతీయ కట్టుబాట్లకు ఢోకా రానివ్వకుండా సంప్రదాయ బద్ధంగా వరుణ్‌, లావణ్యల వివాహం జరిగినట్టు సమాచారం. ఈ వేడుకకు హాజరైన వారిలో చిరంజీవి దంపతులు, పవన్‌కల్యాణ్‌ దంపతులు, అల్లు అర్జున్‌ దంపతులు, రామ్‌ చరణ్‌ దంపతులు ఇంకా మిగిలిన కుటుంబసభ్యులు, బంధుమిత్రులు పలువురు ఉన్నారు. దాదాపు వేడుకకు హాజరైన అందరూ సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించారు.

Social Share Spread Message

Latest News