విలక్షణ నటుడు విక్రమ్ నటించిన చిత్రం వీర ధీర శూరన్. ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వం. ఈ సినిమాను హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు నిర్మిస్తుంది. విక్రమ్ బర్త్ డే సందర్భంగా ఇటీవలే టైటిల్ టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించి సాలిడ్ అప్‌డేట్‌ను ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తమిళనాడు పశ్చిమ కనుమల్లోని అతి సుందరమైన తెన్‌కాశిలో జరుగుతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ మూవీలోని ప్రధాన భాగం ఇక్కడనే షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలిపింది. ఈ చిత్రంలో మలయాళ విలక్షణ నటుడు సిద్ధికీతో పాటు ఎస్.జె.సూర్య, దుశరా విజయన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.