తమిళ అగ్ర హీరో విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం వీర ధీర శూరన్. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అరుణ్ కుమార్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని హెచ్‌ఆర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమా రెండో భాగం వీర ధీర శూరన్-2 టీజర్‌ను విడుదల చేశారు. విక్రమ్ పాత్రలోని రెండు భిన్న పార్శాల్ని ఆవిష్కరిస్తూ టీజర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. విక్రమ్ నటన, యాక్షన్ సీక్వెన్స్‌లు హైలైట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కి స్తున్నామని, వినూత్న కథాంశంతో ఆకట్టుకుంటుందని, దీనికి ప్రీక్వెల్‌గా మొదటి భాగం ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: తేని ఈశ్వర్, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాత: రియా శిబు, దర్శకత్వం: అరుణ్ కుమార్.