వెన్నెల కిషోర్ హీరోగా నటించిన చిత్రం చారి 111. సంయుక్తా విశ్వనాథన్ కథానాయిక. కీర్తి కుమార్ దర్శకు డు. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఒక కన్ను భూగోళం..ఒక కన్ను ఆకాశం..విశ్వాన్ని వెతికేద్దాం పదా..ఓ చక మక మొదలిక..సాహసాల యాత్ర ఆగదిక..ఆపరేషన్ రుద్రనేత్ర అంటూ ఈ సాగిన ఈ గీతాన్ని రామజోగయ్యశాస్త్రి రచించగా, సంజీత భట్టాచార్య ఆలపించారు. సైమన్ కె కింగ్ స్వరపరిచారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ సరికొత్త అవతారంలో కనిపిస్తారని, గూఢచారి పాత్రలో ఆయన పండించే వినోదం కడుపుబ్బా నవ్విస్తుందని చిత్ర బృందం పేర్కొంది. మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కెమెరా: కషిష్ గ్రోవర్, సంగీతం: సైమన్ కె కింగ్, రచన-దర్శకత్వం: టీజీ కీర్తి కుమార్.