Skip to main content

Namaste NRI

వెన్నెల కిషోర్ నటించిన చారి 111 థీమ్ సాంగ్ విడుదల

వెన్నెల కిషోర్‌ హీరోగా నటించిన చిత్రం చారి 111. సంయుక్తా విశ్వనాథన్‌ కథానాయిక.  కీర్తి కుమార్‌ దర్శకు డు. బర్కత్‌ స్టూడియోస్‌ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా థీమ్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఒక కన్ను భూగోళం..ఒక కన్ను ఆకాశం..విశ్వాన్ని వెతికేద్దాం పదా..ఓ చక మక మొదలిక..సాహసాల యాత్ర ఆగదిక..ఆపరేషన్‌ రుద్రనేత్ర అంటూ ఈ సాగిన ఈ గీతాన్ని రామజోగయ్యశాస్త్రి రచించగా, సంజీత భట్టాచార్య ఆలపించారు. సైమన్‌ కె కింగ్‌ స్వరపరిచారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌ సరికొత్త అవతారంలో కనిపిస్తారని, గూఢచారి పాత్రలో ఆయన పండించే వినోదం కడుపుబ్బా నవ్విస్తుందని చిత్ర బృందం పేర్కొంది. మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కెమెరా: కషిష్‌ గ్రోవర్‌, సంగీతం: సైమన్‌ కె కింగ్‌, రచన-దర్శకత్వం: టీజీ కీర్తి కుమార్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events