Namaste NRI

వేణు ఊడుగుల రాజు వెడ్స్ రాంబాయి.. టైటిల్ గ్లింప్స్ లాంచ్

వేణు ఊడుగుల  నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రానికి రాజు వెడ్స్‌ రాంబాయి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా ద్వారా సాయిలు కంపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. డోలాముఖి సబాల్టర్న్‌ ఫిల్మ్స్‌, మాన్సూన్‌ టేల్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరంగల్‌, ఖమ్మం సరిహద్దులోని ఓ గ్రామంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్ర టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో కథానాయికను యెనగంటి రాంబాయి పాత్రలో పరిచయం చేశారు. బొగ్గు గనుల ప్రాంతమైన ఇల్లెందు మండలం నేపథ్యంలో అందమైన గ్రామీణ ప్రేమకథగా తీర్చిదిద్దిన్నట్లు గ్లింప్స్‌ చూస్తే అర్థమవుతున్నది.

ఈ సందర్భంగా నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ కథ జరిగిన ప్రాంతం, అక్కడి మనుషుల అమాయక త్వం, వారి మధ్య సంఘర్షణ నన్ను ఎంతగానో కదిలించింది. ముఖ్యంగా ైక్లెమాక్స్‌ ఘట్టాలు కొన్ని రోజుల పాటు నిద్రపోనివ్వలేదు. ఇంతటి వైవిధ్యమైన ప్రేమకథను ఇప్పటివరకు వినలేదు. ఈ కథ విని ఈటీవీ విన్‌ వాళ్లు మాతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చారు అని చెప్పారు. ఈ కథలోని పాత్రలన్నీ సహజంగా కనిపిస్తాయని ఈటీవీ విన్‌ హెడ్‌ సాయికృష్ణ పేర్కొన్నారు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: వాజిద్‌ బేగ్‌, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, నిర్మాతలు: వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి, రచన-దర్శకత్వం: సాయిలు కంపాటి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events