ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి సంధ్యారాజు నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం నాట్యం. రేవంత్ కోరుకోండ దర్శకుడు. ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చిన ఈ చిత్రం కథ ఆభివ్యక్తిలో నృత్యభూమికను అర్థవంతంగా ఆవిష్కరిస్తూ ఆకట్టుకుంటున్నది. ఈ సినిమా వీక్షించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదిక తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నాట్యకళ గొప్పతనాన్ని తెలియజెప్పింది. భారతీయ సంస్కృతిలో కళల ప్రాధాన్యతను కళ్లకు కడుతూ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు రేవంత్‌తో పాటు చిత్రబృందాన్ని అభినందిస్తున్నా అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. నాట్యం చిత్రాన్ని వీక్షించిన బాలకృష్ణ సైతం ప్రశంసించారు.