Skip to main content

Namaste NRI

నాట్యంకు ఉప రాష్ట్రపతి అభినందన

ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి సంధ్యారాజు నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం నాట్యం. రేవంత్‌ కోరుకోండ దర్శకుడు. ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చిన ఈ చిత్రం కథ ఆభివ్యక్తిలో నృత్యభూమికను అర్థవంతంగా ఆవిష్కరిస్తూ ఆకట్టుకుంటున్నది. ఈ సినిమా వీక్షించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్‌ వేదిక తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నాట్యకళ గొప్పతనాన్ని తెలియజెప్పింది. భారతీయ సంస్కృతిలో కళల ప్రాధాన్యతను కళ్లకు కడుతూ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు రేవంత్‌తో పాటు చిత్రబృందాన్ని అభినందిస్తున్నా అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.  నాట్యం చిత్రాన్ని వీక్షించిన బాలకృష్ణ సైతం ప్రశంసించారు.

Social Share Spread Message

Latest News