అగ్ర కథానాయకుడు వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. నేడు వెంకటేష్ జన్మదినం. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన స్టైలిష్ గా కనిపిస్తున్నారు. నేడు ఈ సినిమా తాలూకు సెకండ్ సింగిల్ ప్రోమోని విడుదల చేయబో తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం ట్రయాంగిల్ క్రైమ్ కామెడీ కథ. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటకు మంచి స్పందన లభిస్తున్నది. సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది అని చిత్రబృందం పేర్కొంది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్రప్రసాద్, సాయికుమార్ తదితరులు నటిస్తున్నారు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.