కల్కి 2898 ఏడీ సినిమా చూసిన వాళ్లంతా హఠాత్తుగా అర్జునుడి పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండను చూసి ఫిదా అయిపోతున్నారు. ఇన్నాళ్లూ యూత్ ఐకాన్‌గా మాత్రమే కనిపించి, మురిపించిన విజయ్ దేవరకొండ కల్కి 2898 ఏడీ లో గాండీవాన్ని ధరించి, అర్జునుడిగా కాసేపు చెలరేగిపోయాడు. నిజానికి మైథలాజికల్ పాత్రలు రావడమే అరుదు. పైగా అర్జునుడి పాత్ర. నిడివి తక్కువే అయినా అదరహో అనిపించాడు.
విజయుడిగా విజయ్ మేకోవర్, చెప్పిన పవర్‌ఫుల్ డైలాగులు, పలికించిన ఎమోషన్స్ కల్కి హైలైట్స్‌లో భాగమయ్యాయి. తెరపై విజయుడిగా విజయ్ దేవరకొండను చూడగానే ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో స్పందన వస్తున్నది. ఏదిఏమైనా విజయ్ అని పేరు పెట్టుకున్నందుకు ధనుర్ధారి విజయుడిగా తెరపై విశ్వరూపం చూపించి, సార్థకనాముడు అనిపించుకున్నాడు విజయ్ దేవరకొండ. కల్కి 2898ఏడీ సినిమాతో విజయ్‌తో మైథలాజికల్ కేరక్టర్లు కూడా ట్రై చేయొచ్చని నిరూపితమైందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.