
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా చేస్తున్న సినిమాకు వర్కింగ్ టైటిల్ వీడీ 12. గౌతమ్ తన్ననూరి దర్శకుడు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలోని పలు సుందరమైన ప్రదేశాల్లో జరిగింది. ఇప్పటివరకూ 60శాతం చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది మార్చి 28న సినిమాను విడుదల చేయనున్నట్టు నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య తెలిపారు. హిజ్ డెస్టినీ అవెయిట్స్ హిమ్ అంటూ ఈ సినిమా పోస్టర్‌ను తన సోషల్‌మీడియా ఖాతాల్లో షేర్ చేశారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ని ఈ నెలలోనే విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుథ్ రవిచందర్.
