Namaste NRI

మార్చిలో విజయ్‌ దేవరకొండ చిత్రం

f8900b5f 232d 4ed0 9e9a f342ae9bc1c6 6

విజయ్‌ దేవరకొండ  కథానాయకుడిగా  చేస్తున్న సినిమాకు వర్కింగ్‌ టైటిల్‌ వీడీ 12. గౌతమ్‌ తన్ననూరి దర్శకుడు. ఇంటెన్స్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ శ్రీలంకలోని పలు సుందరమైన ప్రదేశాల్లో జరిగింది. ఇప్పటివరకూ 60శాతం చిత్రీకరణ పూర్తయింది.  వచ్చే ఏడాది మార్చి 28న సినిమాను విడుదల చేయనున్నట్టు నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య తెలిపారు. హిజ్‌ డెస్టినీ అవెయిట్స్‌ హిమ్‌ అంటూ ఈ సినిమా పోస్టర్‌ను తన సోషల్‌మీడియా ఖాతాల్లో షేర్‌ చేశారు విజయ్‌ దేవరకొండ. ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ని ఈ నెలలోనే విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుథ్‌ రవిచందర్‌.

50e409c6 592a 4e9f 922f 2a94141522d8 6
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events