Namaste NRI

రాజస్థాన్‌లో అంగ రంగ వైభవంగా విజయ్‌-రష్మిక వివాహం!

టాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు వివాహబంధంతో ఒక్కటయ్యిన‌ట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, నేడు ఉదయం 10.10 గంటలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా రష్మిక మెడలో విజయ్‌ మూడుముళ్లు వేశార‌ని స‌మాచారం. ఈ వివాహ వేడుక రెండు భిన్న సంస్కృతుల కలయికగా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఉదయం విజయ్‌ కుటుంబ సంప్రదాయం ప్రకారం హిందూ పద్ధతిలో పెళ్లి వేడుక పూర్తికాగా, సాయంత్రం 4:30 గంటలకు రష్మిక కుటుంబ ఆచారాల ప్రకారం మరోసారి వివాహం జరగనుంది.

ఈ వేడుక కోసం ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే ఉదయ్‌పూర్‌ చేరుకున్నారు. తమ అభిమాన నటులు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడంతో నెటిజన్లు విరోష్‌ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఉదయ్‌పూర్‌లో సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహం అనంతరం, మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, రాజకీయ నేతల కోసం భారీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events