విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ఏసీఈ (ఏస్). అరుముగకుమార్ దర్శకుడు. రుక్మిణి వసంత్ కథానాయిక. ఈ సినిమా టైటిల్, టీజర్ సోషల్‌మీడియాలో రికార్డు వ్యూస్ సాధించాయి. దీంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. గురువారం విజయ్ సేతుపతి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఈ సినిమాలో ఆయన బోల్డ్ కన్నన్ అనే పాత్రలో కనిపించనున్నారు. తాజా గ్లింప్స్‌లో ఆయన సంప్రదాయ తమిళ దుస్తులు ధరించి కనిపించారు. మలేషియా విమానాశ్రయంలో తెరకెక్కించిన యాక్షన్ ఘట్టాలతో గ్లింప్స్ ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి పోషిస్తున్న బోల్డ్ కన్నన్ పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుందని, ఆయన కెరీర్‌లో మరో వైవిధ్యమైన పాత్రగా నిలిచిపోతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో యోగి బాబు, బి.ఎస్.అవినాష్, దివ్య పిైళ్లె, బబ్లు, రాజ్ కుమార్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.