విజయ్ హీరోగా, వెంకట్‌ప్రభు దర్శకత్వంలో 68వ చిత్రంలో నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ సినిమాకు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో రెండు క్యారెక్టర్స్ తాలూకు లుక్‌ను రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా టైమ్ ట్రావెల్ కథాంశంతో దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, జయరాం, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.














