Skip to main content

Namaste NRI

జూనియర్ నుంచి వైరల్ వయ్యారి సాంగ్ రిలీజ్

రాజకీయ నాయకుడు గాలి జనార్ధన రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రం జూనియర్‌. రాధాకృష్ణ దర్శకుడు. వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. శ్రీలీల కథానాయిక. ఈ నెల 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ వేగాన్ని పెంచారు. వైరల్‌ వయ్యారి  అనే గీతాన్ని విడుదల చేశారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరపరచిన ఈ గీతాన్ని కల్యాణ్‌ చక్రవర్తి రచించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫాలోయింగ్‌ చూశావంటే మైండ్‌బ్లోయింగ్‌, ఫాలోవర్స్‌ అందరికీ నేనే డార్లింగ్‌, నేనేమి చేసినా ఫుల్‌ ట్రెండింగ్‌ అంటూ యూత్‌కు కనెక్ట్‌ అయ్యేలా సోషల్‌మీడియాలో వాడే లాంగ్వేజ్‌తో ట్రెండీగా ఈ పాట సాగింది. దేవిశ్రీప్రసాద్‌, హరిప్రియ ఆలపించారు. ఇందులో కిరీటి రెడ్డి, శ్రీలీల కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. జెనీలియా, రవిచంద్రన్‌ తదితరులు నటిస్తు న్నారు. ఈ చిత్రానికి కెమెరా: సెంథిల్‌ కుమార్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, రచన-దర్శకత్వం: రాధాకృష్ణ.

Social Share Spread Message

Latest News