
మిత్రశర్మ, గీతానంద్, శ్రీహాన్, జన్నీఫర్ ఇమ్మాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం వర్జిన్ బాయ్స్. దయానంద్ గడ్డం దర్శకుడు. రాజా దారపునేని నిర్మాత. ప్రమోషన్‌లో భాగంగా దం దిగా దం అంటూ సాగే ఈ సినిమా లోని పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇదొక యూత్‌ఫుల్ ఎంటైర్టెనర్. వినోదంతోపాటు ఇందులో మంచి ప్రేమకథ కూడా ఉంటుంది అని తెలిపారు. ఈ సమావేశంలో చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు. జూలై 11న సినిమా విడుదల కానుంది.
