మనసంతా నువ్వే, శ్రీరామ్, నేనున్నాను వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వీఎన్ ఆదిత్య. త్వరలోనే వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో మరో కొత్త సినిమా రాబోతుంది. ఓఎంజీ ప్రొడక్షన్ హౌస్ అనే కొత్త నిర్మాణ సంస్థలో, డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మాతగా, వీఎన్ ఆదిత్య డైరెక్షన్లో కొత్త సినిమా రాబోతున్న ట్లు చిత్ర బృందం ప్రకటించారు. ఈ మేరకు జూలై 7, ఆదివారం నాడు..అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో లో లాకింట బంకేట్ హాల్లో నిర్మహించిన మీడియా సమావేశంలో కొత్త సినిమాపై ప్రకటన చేశారు. వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చే ఈ కొత్త మూవీ నిర్మాణం డల్లాస్‌లో జరగనుందని, త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్తుందని మేకర్స్ తెలిపారు. అయితే సినిమాకు సంబంధించి తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్ హౌస్ ఆడిషన్స్ నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు మాత్రమే కాక, విదేశీయులు అనగా అమెరికన్స్, స్పానిష్ పీపుల్, ఆఫ్రికన్స్, యూరోపియన్స్, ఏషియన్స్, ఇండియన్స్ మరీ ముఖ్యంగా తమిళ్, కన్నడ, తెలుగు వారు భారీ సంఖ్యలో ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతూ.. ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. దీనిపై దర్శకుడు వీఎన్ ఆదిత్య తన హర్షం వ్యక్తం చేశారు.