విజయ్ సేతుపతి నటిస్తున్నచిత్రం మహారాజ. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం. సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని ఈ నెల 14న ఎన్‌వీఆర్ సినిమాస్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నది. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక ను నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ నా కెరీర్‌లో ఈ సినిమాకు ఎంతో ప్రత్యేకత ఉంది. చూసినవారందరూ బాగుందని మెచ్చుకున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అందరికీ నచ్చుతుంది.
విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం అన్నారు. విజయ్ సేతుపతికి తాను పెద్ద ఫ్యాన్‌నని, ఆయనతో వర్క్ చేయడం ఆనందంగా ఉందని కథానాయిక మమతా మోహన్‌దాస్ పేర్కొంది. మాస్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న చిత్రమిదని నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలిపారు. భారతీయరాజా, అభిరామి, సింగం పులి తదిత రులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్ పురుషోత్తమన్, సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్, రచన-దర్శకత్వం: నితిలన్ స్వామినాథన్.