Namaste NRI

మేం సిద్ధం ప్రపంచదేశాలకు.. ఇరాక్‌ సందేశం

తమ దేశం చమురు విక్రయాలకు సిద్ధంగా ఉందని ఇరాక్‌ ప్రపంచ దేశాలకు సందేశం పంపింది. హర్మూజ్‌ గుండా ఇరాక్‌ చమురు రవాణాకు ఇరాన్‌ అనుమతించినట్లు మీడియా కథనాలు వెల్లడయ్యాయి. ఆ వెంటనే ఇరాక్ ప్రభుత్వ చమురు విక్రయ సంస్థ సోమో ఈ ప్రకటన చేసింది. 24 గంటల్లోగా ముడి చమురు నౌకల నామినేషన్‌లు, ఒప్పంద పరిణామంతో సహా తరలింపు షెడ్యూళ్లను పంపాలని వినియోగదారులను కోరింది. ఇరాక్‌లోని బస్రా ఆయిల్ టెర్మినల్ , దాని అనుబంధ సౌకర్యాలతో సహా అన్ని చమురు లోడింగ్ టెర్మినల్స్ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని, ప్రపంచ దేశాలకు చమురు రవాణా చేయడానికి తాము పూర్తి సంసిద్ధతతో ఉన్నామని సోమో పేర్కొంది. ఇరాక్‌ నుంచి భారీగా చమురు కొనుగోలు చేసే దేశాల్లో భారత్‌ కూడా ఒకటని తెలిపింది. యుద్ధం మొదలైన అనంతరం ఇరాన్‌ హర్మూజ్‌పై నిబంధనలు విధించడంతో ఇరాక్‌ నుంచి చమురు సరఫరా నిలిచిపోయింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events