
ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోమారు భారత్‌పై బెదిరింపులకు దిగాడు. నవంబర్ 16, 17 తేదీల్లో అయోధ్య రామమందిరం సహా పలు హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతామని హెచ్చరించాడు. ఈ మేరకు పన్నూ వీడియో ప్రసంగం ఒకటి బయటకు వచ్చింది. హిందూత్వ భావజాలానికి కేంద్రమైన అయోధ్య పునాదుల్ని కదిలిస్తాం అంటూ పన్నూ బెదిరించాడు. అలాగే, హిందూ ఆలయాలపై ఖలిస్థానీలు దాడులకు దిగుతారని, వీటికి సిద్ధంగా ఉండాలని కెనడాలోని హిందువులను హెచ్చరించాడు.
