Skip to main content

Namaste NRI

అయోధ్య రామమందిరంపై దాడి చేస్తాం.. ఉగ్రవాది పన్నూ వార్నింగ్

ఖలిస్థాన్‌ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ మరోమారు భారత్‌పై బెదిరింపులకు దిగాడు. నవంబర్‌ 16, 17 తేదీల్లో అయోధ్య రామమందిరం సహా పలు హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతామని హెచ్చరించాడు. ఈ మేరకు పన్నూ వీడియో ప్రసంగం ఒకటి బయటకు వచ్చింది. హిందూత్వ భావజాలానికి కేంద్రమైన అయోధ్య పునాదుల్ని కదిలిస్తాం అంటూ పన్నూ బెదిరించాడు. అలాగే, హిందూ ఆలయాలపై ఖలిస్థానీలు దాడులకు దిగుతారని, వీటికి సిద్ధంగా ఉండాలని కెనడాలోని హిందువులను హెచ్చరించాడు.

Social Share Spread Message

Latest News