ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు మనం పంపిన మెసేజ్‌లను పూర్తిగా డిలీట్ చేసేందుకు డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ తీసుకొచ్చిన, దీనికి కాల పరిమితి విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పరిమితిని పెంచుతున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. మెసేజ్ పంపిన రెండు రోజుల తర్వాత కూడా దాన్ని పర్మినెంట్‌గా డిలీట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడిరచింది. ఈ విషయాన్ని వాట్సాప్ అధికారికంగా ప్రకటించింది. ఇక నుంచి వినియోగదారులు తాము పంపిన మెసేజ్‌లను 2 రోజుల 12 గంటల వరకు డిలీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఈ పరిమితి కేవలం 69 నిమిషాలుగానే ఉండేది.