Namaste NRI

వాట్సాప్‌ కొత్త ఫీచర్‌.. 2 రోజుల తర్వాత  కూడా

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు మనం పంపిన మెసేజ్‌లను పూర్తిగా డిలీట్‌ చేసేందుకు డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌ ఫీచర్‌ తీసుకొచ్చిన, దీనికి కాల పరిమితి విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పరిమితిని పెంచుతున్నట్లు వాట్సాప్‌ ప్రకటించింది. మెసేజ్‌ పంపిన రెండు రోజుల తర్వాత కూడా దాన్ని పర్మినెంట్‌గా డిలీట్‌  చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడిరచింది. ఈ విషయాన్ని వాట్సాప్‌ అధికారికంగా ప్రకటించింది. ఇక నుంచి వినియోగదారులు తాము పంపిన మెసేజ్‌లను 2 రోజుల 12 గంటల వరకు డిలీట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఈ పరిమితి కేవలం 69 నిమిషాలుగానే ఉండేది.

Social Share Spread Message

Latest News