సుధీర్‌బాబు కథానాయకుడిగా రూపొందిన చిత్రం మా నాన్న సూపర్‌హీరో. అర్ణ, సాయిచంద్, షాయాజీ షిండే కీలక పాత్రధారులు. సునీల్ బలుసు నిర్మాత. ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో సుధీర్‌బాబు మాట్లాడా రు. నాకు గొప్ప జీవితాన్నివ్వడానికి నాన్న పడ్డ కష్టం నాకు తెలుసు. అందుకే సుధీర్‌బాబు సన్నాఫ్ పోసాని నాగేశ్వరరావు అని చెప్పుకోడానికి గర్విస్తా. ఇది సూపర్‌హీరో సినిమా కాదు. కానీ ఆ సినిమాల్లో హీరోలకి వుండే సూపర్ పవర్ ఈ సినిమాలో ఉంటుంది. ఆ పవర్ పేరే ప్రేమ. ఇద్దరు సూపర్‌హీరోల మధ్య సాగే ప్రేమకథ ఇది. నా కెరీర్ మొత్తంలో నటుడిగా నాకు తృప్తినిచ్చిన సినిమా కూడా ఇదే. దర్శకుడు అభిలాష్ కంకర అద్భుతం గా తీశాడు. కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇది అని అన్నారు.
సుధీర్‌బాబు తండ్రిగా నటించడం పట్ల నటుడు షాయాజీ షిండే ఆనందం వెలిబుచ్చారు. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉందని హీరోయిన్ అర్ణ అన్నారు. ఇంకా దర్శకుడు అభిలాష్ కంకర, నటుడు శశాంక్, సంగీత దర్శకుడు జై క్రిష్ కూడా మాట్లాడారు. రాజు సుందరం, ఆమని ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 11న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ కల్యాణి, నిర్మాణం: వి.సెల్యులాయిడ్స్.