రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే స్టీల్, అల్యూమినియంపై దిగుమతి సుంకాన్ని 25 శాతం నుంచి 50 శాతానికి పెంచుతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ తాజాగా సంతకాలు చేశారు. యూకేతో వాణిజ్య ఒప్పందం అమలులో ఉన్న నేపథ్యంలో వారికి మాత్రం టారిఫ్‌లు 25 శాతంగానే ఉండనున్నాయి.

దేశాలతో చర్చలు జరుగుతుండగానే వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. స్టీల్, అల్యూమినియంపై సుంకాలను 50 శాతానికి పెంచారు. పెంచిన సుంకాలు ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. స్వదేశీ స్టీల్ పరిశమ్రను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. తమ ప్రభుత్వం నిర్ణయం వల్ల స్థానిక స్టీల్ పరిశ్రమకు ఊతం వస్తుందని, జాతీయ సరఫరా పెరుగుతుందని, దీంతో చైనాపై ఆధారపడే సందర్భాలు తగ్గుతాయని ట్రంప్ పేర్కొన్నారు.
