Skip to main content

Namaste NRI

భారత్-అమెరికా డీల్‌పై.. మాట మార్చిన వైట్‌హౌస్

భారత్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై విడుదల చేసిన అధికారిక ఫ్యాక్ట్‌షీట్‌లో వైట్‌హౌస్ నిశ్శబ్దంగా కీలక మార్పులు చేసింది. ఒప్పంద వివరాలు వెల్లడించిన కొన్ని రోజులకే ఈ సవరణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, భారత్ కొనుగోళ్లకు సంబంధించిన పదజాలాన్ని మార్చడంతో పాటు, కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు, డిజిటల్ పన్నుల ప్రస్తావనను తొలగించింది.

తొలుత విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్‌లో, అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు భారత్ “నిబద్ధతతో ఉంది” అని పేర్కొన్నారు. అయితే, సవరించిన వెర్షన్‌లో ఈ పదాన్ని “కొనుగోలు చేయాలని భావిస్తోంది” అని మార్చారు. ఒప్పందంపై భారత్ వైపు నుంచి ఉన్న కట్టుబాటు తీవ్రతను ఈ మార్పు తగ్గించేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Social Share Spread Message

Latest News