Namaste NRI

తెలంగాణ అసోసియేష‌న్ ఆఫ్ జ‌ర్మ‌నీ ఆధ్వ‌ర్యంలో వ‌న భోజ‌నాలు

జర్మనీ రాజధాని బెర్లిన్‌లో తెలంగాణ అసోసియేష‌న్ ఆఫ్ జ‌ర్మ‌నీ (ట్యాగ్‌) ఆధ్వ‌ర్యంలో క‌న్నుల పండువ‌గా వ‌న భోజ‌నాలు నిర్వ‌హించారు. బెర్లిన్‌లోని చారిత్ర‌క వోల్క్స్ పార్కులో ఈ వ‌న భోజ‌నాలు జ‌రిగాయి. వ‌న భోజ‌నాల వేడుక చూడ‌ముచ్చ‌ట‌గా సాగింద‌ని ట్యాగ్ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ర‌ఘు చ‌లిగంటి తెలిపారు. బెర్లిన్, స‌మీప ప్రాంతా ల్లో నివ‌సిస్తున్న ప‌లువురు తెలంగాణ కుటుంబాలు క‌లిసి ఆడి పాడారు. ఒక‌రితో మ‌రొక‌రు క‌లిసిపోయి త‌మ విలువైన స‌మ‌యాన్ని వెచ్చించారు. ప్ర‌తి ఏటా వేస‌విలో తెలంగాణ సంప్ర‌దాయాన్నిసుసంప‌న్నం చేయ‌డాని కి వ‌న భోజ‌నాల కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్లు డాక్ట‌ర్ ర‌ఘు చలిగంటి తెలిపారు.

ఇటీవ‌ల జ‌ర్మ‌నీకి వ‌ల‌స వ‌చ్చే కొత్త కుటుంబాల‌కు స్వాగ‌తం ప‌లుకుతూ వ‌న భోజ‌నాలు నిర్వ‌హిస్తున్నామ‌న్నా రు. త‌ద్వారా త‌మ కుటుంబాల మ‌ధ్య అనుబంధం, అనురాగాన్ని బ‌లోపేతం చేస్తున్నామ‌ని తెలిపారు.  వ‌న భోజ‌నాల కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ కోసం అంకిత భావంతో ప‌ని చేసిన ట్యాగ్ కార్య‌ద‌ర్శులు శ‌ర‌త్‌, ఆల్‌కే, న‌రేష్‌ల‌ కు హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు ర‌ఘు చ‌లిగంటి చెప్పారు. ఈ వేడుక విజ‌యవంతం కావ‌డానికి క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన వాలంటీర్ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events