రఘు, అనుశ్రీ జంటగా బియస్‌ఆర్ క్రియేషన్స్, రావుల క్రియేషన్స్, పాలిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పాలిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దామోదరప్రసాద్ క్లాప్‌నివ్వగా, ప్రసన్నకుమార్ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ 1960-80ల నడుమ తెలంగాణలో జరిగిన యథార్థ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. పీరియాడిక్ థ్రిల్లర్‌గా లవ్, సస్పెన్స్ అంశాలతో ఆకట్టుకుంటుంది అన్నారు. వరంగల్, ములుగు, అరకు ప్రాంతాల్లో చిత్రీకరణ జరపడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. బాహుబలి ప్రభాకర్, జీవ, సుమన్‌శెట్టి., సిద్ధి, మధుప్రియ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్, సంగీతం: జాన్ భూషన్, నిర్మాతలు: భోగి సుధాకర్, రావుల రమేష్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పాలిక్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)