Skip to main content

Namaste NRI

తెలంగాణలో జరిగిన..యథార్థ సంఘటనలతో

రఘు, అనుశ్రీ జంటగా బియస్‌ఆర్‌ క్రియేషన్స్‌, రావుల క్రియేషన్స్‌, పాలిక్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పాలిక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దామోదరప్రసాద్‌ క్లాప్‌నివ్వగా, ప్రసన్నకుమార్‌ కెమెరా స్విఛాన్‌ చేశారు.  దర్శకుడు మాట్లాడుతూ 1960-80ల నడుమ తెలంగాణలో జరిగిన యథార్థ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. పీరియాడిక్‌ థ్రిల్లర్‌గా లవ్‌, సస్పెన్స్‌ అంశాలతో ఆకట్టుకుంటుంది అన్నారు. వరంగల్‌, ములుగు, అరకు ప్రాంతాల్లో చిత్రీకరణ జరపడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. బాహుబలి ప్రభాకర్‌, జీవ, సుమన్‌శెట్టి., సిద్ధి, మధుప్రియ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌, సంగీతం: జాన్‌ భూషన్‌, నిర్మాతలు: భోగి సుధాకర్‌, రావుల రమేష్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పాలిక్‌.

Social Share Spread Message

Latest News