బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వయిజర్‌గా నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ప్రధాని పదవితో సమానమని అధికారులు ప్రకటించారు. అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహించడానికి 16 మంది సభ్యుల తో సలహా మండలిని ప్రకటించారు. ఇందులో విద్యార్థి ఉద్యమానికి నేతృత్వం వహించిన మహ్మద్ నహీద్ ఇస్లామ్, ఆసిఫ్ మహమ్మద్‌లకు కూడా స్థానం కల్పించారు. ప్రస్తుతం దేశంలో శాంతిని నెలకొల్పి పౌరులకు రక్షణ కల్పించడమే తమ తొలి ప్రాధాన్యమని 84 ఏండ్ల యూనస్ తెలిపారు.