Namaste NRI

ప్రతి మధ్య తరగతి కుటుంబానికి కనెక్ట్‌ అయ్యే కథ ఇది

సముద్రఖని ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం కార్మేని సెల్వం. రామ్‌చక్రి దర్శకుడు. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మీనన్‌ కీలక పాత్రధారి. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సముద్రఖని మాట్లాడుతూ ఈ సినిమాలో మన జీవితాన్ని కొత్త కోణంలో చూస్తాం. థియేటర్‌ నుంచి బయటికొచ్చిన ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసే సినిమా ఇది. మనపై ఉన్న బరువుల్ని తగ్గించుకుంటే కలల్ని సులభంగా నెరవేర్చుకోగలుగుతాం అనే అంశం అందరికి కనెక్ట్‌ అవుతుంది అన్నారు.


ప్రతి మధ్య తరగతి కుటుంబానికి కనెక్ట్‌ అయ్యే కథ ఇదని, అందరూ అప్పులను తగ్గించుకొని ఆనందంగా ఉండాలనే సందేశంతో మెప్పిస్తుందని దర్శకుడు రామ్‌చక్రి తెలిపారు. జీవితం తాలూకు ఆర్థిక వ్యవహారాల పట్ల అందరిలో అవగాహన పెంచే సినిమా ఇదని నటి అభినయ చెప్పారు. లక్ష్మిప్రియా, అభినయ, కార్తీక్‌ కుమార్‌ తదితరులు నటిస్తున్నారు. ఏప్రిల్‌ 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: పాత్‌వే ప్రొడక్షన్స్‌, నిర్మాత: అరుణ్‌ గంగరాజులు, కథ, దర్శకత్వం: రామ్‌చక్రి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events