Skip to main content

Namaste NRI

ఇండియాతో సహా ఆ నాలుగు దేశాలకు అనుమతి!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్​ జలసంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. తన మిత్ర దేశాలైన ఇండియా, చైనా, రష్యా, ఇరాక్‌, పాకిస్థాన్‌ వంటి ఐదు దేశాల నౌకల ప్రయాణానికి హర్మూజ్‌ జలసంధిని అనుమతి ఇస్తామని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చి ప్రకటించారు. ఈ మేరకు ఈ విషయాన్ని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం వెల్లడించింది.

కాగా, దేశంలో ఇంధన కొరత ఏర్పడుతోందన్న ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌ ప్రకటన ఇండియాకు ఎంతో ఉపశమనం కలిగించింది. ఉద్రిక్తతల కారణంగా భారత్‌కు చెందిన నౌకలు రోజుల తరబడి అక్కడే నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే మన నౌకలు సురక్షితంగా హర్మూజ్‌ దాటేందుకు ఇరాన్ అధికారులతో కేంద్రం నిరంతరం సంప్రదింపులు జరిపింది. ఇప్పుడు ఇరాన్ ప్రకటనతో భారత్‌కు పెట్రోల్‌, గ్యాస్‌ సమస్యలు తగ్గే అవకాశం ఉంది.

Social Share Spread Message

Latest News