Skip to main content

Namaste NRI

నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం

నటసింహం నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. దశాబ్దాలుగా సినిమా రంగానికి చేసిన కృషికిగానూ ఆయనకు ప్రతిష్టాత్మక లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్ (జీవితకాల సాఫల్య) అవార్డు దక్కింది. దిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగిన దిల్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 (ఐఎఫ్ఎఫ్ డి) వేడుకల్లో ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు. దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతులమీదుగా బాలయ్య అవార్డు అందుకున్నారు.

బాలయ్యతోపాటుగా సీనియర్ నటి షర్మిలా ఠాగూర్, దివంగత నటుడు ధర్మేంద్రకు కూడా లైఫ్​ టైమ్ అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కింది. అయితే ధర్మేంద్ర తరఫున కుటుంబసభ్యులను ఈ అవార్డుతో గౌరవించారు. వీళ్లకు సీఎం రేఖా గుప్తా అవార్డులు ప్రదానం చేశారు. ఇక దిల్లీ పర్యాటక, రవాణా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలు ఈ నెల 31 దాకా కొనసాగనున్నాయి.

అవార్డు అందుకున్న అనంతరం బాలయ్య మాట్లాడారు. తన తల్లిదండ్రుల ఆశీర్వాదంతోనే 50ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో రాణించగలుగుతున్నానని అన్నారు. ఇక వయసు పెరిగేకొద్దీ నటనలో మరింత స్వేచ్ఛ లభిస్తుందని సీనియర్ నటి షర్మిలా ఠాగూర్ తెలిపారు. కాగా బాలయ్య బ్లాక్​బస్టర్ భగవంత్ కేసరి సినిమాను ఈ వేడుకలో ప్రదర్శించనున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేశ్‌ సాహిబ్ సింగ్ వర్మ, నటీమణులు కంగనా రనౌత్, హేమమాలిని, షర్మిలా ఠాగూర్‌ హాజరైయ్యారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events