అయోధ్య లో ఈనెల 22వ తేదీన ప్రధాని మోదీ రామాలయాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఆలయంలో ప్రతిష్టించనున్న రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడిలో స్థాపించారు. 22వ తేదీన ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. రామాలయంలో ప్రతిష్ఠించనున్న రామ్‌లల్లా విగ్రహం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ట్రక్కులో విగ్రహం రాగానే జై శ్రీరామ్ నినాదంతో ప్రాంగణం దద్దరిల్లింది. క్రేన్ సహాయంతో విగ్రహాన్ని గుడిలోకి చేర్చారు. ఆలయ గర్భగుడిలోకి విగ్రహాన్ని తీసుకొచ్చారు. రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకువస్తున్న సమయంలో శిల్పి యోగిరాజ్ అక్కడే ఉన్నారు. ప్రస్తుతం ఆ విగ్రహాన్ని పూర్తిగా కప్పేశారు.
