Namaste NRI

ఆర్సెలర్‌ మిట్టల్‌ కీలక ప్రకటన. ఏపీలో రూ.5,600 కోట్లతో

 ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త లక్ష్మి మిట్టల్‌ కుటుంబం ఆధ్వర్యంలోని ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ ఇండియా కంపెనీ  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెట్టనున్న రూ.3,600 కోట్ల పెట్టుబడిపై కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కర్నూలు జిల్లా ఓర్వకల్లు పరిధిలో ఇటీవలే గ్రీన్కో నేతృత్వంలో ఏర్పాటైన ప్రపంచంలోనే అతిపెద్దదైన రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరినట్లు తెలిపింది. అందులో తన వాటాగా ఏకంగా రూ.4,600 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో ఆర్సెలర్‌ మిట్టల్‌ కంపెనీ చైర్మన్‌ ఆదిత్య మిట్టల్‌ భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా విశాఖలోని తన ప్లాంట్‌ విస్తరణ నిమిత్తం రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరిచింన సంగతి తెలిసిందే. ఈ పెట్టుబడిపైనా ఆ కంపెనీ అధికారికంగా ప్రకటన చేసింది. ఈ రెండు పెట్టుబడుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్రంలో తన పెట్టుబడి రూ.5,600 కోట్లకు చేరినట్లు ఆర్సెలర్‌ మిట్టర్‌ కంపెనీ ప్రకటించింది.

Social Share Spread Message

Latest News