Skip to main content

Namaste NRI

సెనేట్‌లో.. డోనాల్డ్‌ ట్రంప్‌కు ఊరట

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఊరట లభించింది. ఇరాన్‌తో చేసే యుద్ధంలో కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి చేయడానికి ప్రవేశ పెట్టిన తీర్మానం వీగిపోయింది. వార్ పవర్స్ రిజల్యూషన్ గా పిలిచే ఈ తీర్మానంపై సెనేట్‌లో ఓటింగ్ నిర్వహించగా 47-53 ఓట్ల తేడాలో తీర్మాణం ఆమోదం పొందలేదు. డెమొక్రాట్ సెనేటర్‌ జాన్‌ ఫెటర్‌మన్‌ తన పార్టీ నిర్ణయానికి భిన్నంగా రిపబ్లిక్‌ పార్టీకి చెందిన ట్రంప్‌కు ఓటేయడం విశేషం. యుద్ధం జరుగుతున్న ఇలాంటి క్లిష్ట సమయంలో సైనికులకు మద్దతు తెలుపాలి తప్పా అధ్యక్షుడి అధికారాల్లో కోతపెట్టడం సరైంది కాదని రిపబ్లికన్ సెనేటర్లు హితవు పలికారు.

కాగా, ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ట్రంప్ సమర్ధించుకున్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ సైన్యం అమెరికాదేనని, యుద్ధంలో అద్భుతంగా పోరాడుతున్నామని చెప్పారు. ఈ ఆపరేషన్ ద్వారా ఇరాన్ సైనిక సామర్థ్యాలు తీవ్రంగా బలహీనపడ్డాయి. మేం ఇంకా విజయవంతంగా కొనసాగుతామని పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వం వేగంగా మారిపోతోంది. నాయకుడిగా ఎవరు ఎన్నుకున్న అంతమొందిస్తామని హెచ్చరించారు.

Social Share Spread Message

Latest News